“National Lok Adalat on 28th”
ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ – త్వరిత న్యాయానికి మంచి అవకాశం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఈ నెల 28వ తేదీ (శనివారం) రాష్ట్రవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. ఈ లోక్ అదాలత్లో వివిధ రకాల పెండింగ్ కేసులను రాజీ మార్గం ద్వారా సులభంగా,త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం కల్పించబడుతుంది.కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఇరు పక్షాల సమ్మతితో వివాదాలను పరిష్కరించుకోవడం ద్వారా సమయం, ఖర్చు ఆదా అవుతుంది. ముఖ్యంగా సివిల్, మోటార్ వాహన ప్రమాదాలు, బ్యాంకు రుణాలు, చెక్కు బౌన్స్ కేసులు వంటి అంశాలలో లోక్ అదాలత్ ద్వారా త్వరగా న్యాయం పొందవచ్చు.సంగారెడ్డి జిల్లా పరిధిలోని సంగారెడ్డి,జహీరాబాద్, జోగిపేట్, నారాయణఖేడ్ కోర్టులలో ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. ప్రజలు, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కేసులను పరస్పర రాజీతో పరిష్కరించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం ద్వారా సత్వర న్యాయం, సమన్యాయం అందించడమే లక్ష్యంగా ఉండగా, సంబంధిత పక్షాలు ముందుకు వచ్చి సహకరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి .భవాని చంద్ర కోరనైనది.
