National Legal Services Day Celebrated in Bhupalpally
జిల్లా కోర్టులో ఘనంగా జాతీయ న్యాయసేవల దినోత్సవం
ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దిలీప్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
మనుషులు కలసి మెలసి జీవించడానికే చట్టాలు ఏర్పడ్డాయని, ఎప్పుడైతే ఇద్దరి మధ్య వివాదం తలెత్తుతుందో అప్పుడు వారిని చక్కదిద్దడానికి చట్టం పనిచేయడం ప్రారంభిస్తుందని ప్రిన్సిపాల్ దిలీప్ కుమార్ నాయక్ అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ న్యాయసేవల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ
కార్యక్రమానికి అతిధిగా హాజరైన జడ్జి మాట్లాడుతూ చట్టాలను వినియోగించుకోవడం తో పాటు పౌరుల బాధ్యతలను తెలిసుకొని మెలగాలని సూచించారు. న్యాయ సహాయం అనేది ముందుకు నడిపించే విధంగా ఉండాలని, సామజిక స్పృహ కలిగి వున్నప్పుడే అది సాధ్యం అవుతుందని తెలిపారు. కేసులు, వివాదాలు లేని సమాజ నిర్మాణం కోసమే న్యాయసేవాధికార సంస్థ పనిచేస్తుందని, లక్ష్యం నెరవేరినప్పుడు గొప్ప సమాజం ఏర్పడుతుందని జడ్జి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి. శ్రీనివాస చారి, ప్రధాన కార్యదర్శి శ్రీ వి. శ్రావణ్ రావు, చీఫ్ డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ పి. శ్రీనివాస్, కే.అక్షయ, న్యాయవాదులు మంగళపల్లి రాజ్ కుమార్, కే.అఖిల, పారా లీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
