ఆర్ట్స్ కళాశాలలో జాతీయ హిందీ దినోత్సవ కార్యక్రమం…

ఆర్ట్స్ కళాశాలలో జాతీయ హిందీ దినోత్సవ కార్యక్రమం
సుబేదారి, నేటిదాత్రి

 

 

 

జాతీయ హిందీ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని హిందీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ హిందీ దివస్ కార్యక్రమానికి కాకతీయ విశ్వవిద్యాలయం హిందీ విభాగం పూర్వ ఆచార్యులు సంజీవ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా హిందీ భాషను ఆరువేల మిలియన్ ప్రజలు మాట్లాడుతున్నారని, ఇది ప్రపంచ భాషగా ఎక్కువగా గుర్తింపు పొందిందని, అంతేకాకుండా పరిపాలకులు ఎవరూ ఉంటే వారి అనుకూలమైన భాషను రాజభాషగా అమలు పరుస్తారని భారతదేశాన్ని ఆంగ్లేయులు, ముస్లింలు పరిపాలించినప్పుడు వారి వారి పరిపాలన కాలంలో పరిపాలనకు అనుకూలమైన భాషను అధికార భాషగా గుర్తించడం జరిగిందన్నారు. భాష ఒక ప్రాంతం, ఒక వ్యక్తి మధ్య అవినాభావ సంబంధాన్ని పెంపొందించడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. భాషను నేర్చుకోవడానికి నిరంతర అధ్యయనం అవసరమన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి మాట్లాడుతూ భారత దేశంలో 60 శాతం మంది ప్రజలు మాట్లాడే భాష హిందీ అని కాబట్టి ఇది రాజభాషగా కొనసాగుతుందని ఆమె అన్నారు, హిందీ భాష కంటే సంస్కృతం పట్ల విద్యార్థులు ఎక్కువగా మక్కువ చూపుతున్నప్పటికీ అధికార భాషగా సంస్కృతాన్ని ఎక్కడ వాడడం లేదని కాబట్టి హిందీ భాష ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హిందీ విభాగం అధ్యక్షురాలు డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ విద్యార్థులు హిందీ భాషను చదవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. విభాగం అధ్యాపకురాలు డాక్టర్ పరహా ఫాతిమా మాట్లాడుతూ హిందీ భాష జాతీయ సమైక్యతకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. ఆంగ్లం కేవలం సాంకేతిక అభివృద్ధి కొరకే దూదపడుతుంది గాని హిందీ నిత్యజీవితంలో వాడుక భాషగా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రెహమాన్, అధ్యాపకులు డాక్టర్ సుధాకర్, డాక్టర్ నాగయ్య, మంజుల, శ్రీలక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version