చిట్యాల, నేటి దాత్రి :
భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి స్వర్గీయ అబుల్ కలాం ఆజాద్ యొక్క 137వ జన్మదిన కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం నవంబర్ 11వ తేదీన జాతీయ విద్యా దినోత్సవం గా జరుపుకుంటారు అదేవిధంగా సోమవారం రోజున చిట్యాల మండల కేంద్రంలోని కాకతీయ స్కూల్లో అబుల్ కలాం చిత్రపటానికి పూలమాలవేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ భారతదేశానికి మొదటి విద్యా శాఖ మంత్రిగా మొదటి ఉపరాష్ట్రపతిగా సేవలందించిన గొప్ప విద్యావేత్త ఈరోజు దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యకు ఆరాధ్యుడు భారతరత్న అబుల్ కలాం ఆజాద్ సేవలు వెలకట్టలేనివి అందుకే విద్యార్థులు అబుల్ కలాం జీవితాన్ని ఆధారంగా తీసుకొని. రేపటి బాబి భారత పౌరులుగా ఎదిగి సమాజానికి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని కోరారు