బాలాజీ టెక్నో స్కూల్లో జాతీయ వైద్యుల దినోత్సవం
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మండలంలోని లక్నెపల్లి లోని బాలాజీ టెక్నో స్కూల్ లో నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేషన్ నిర్వహించారు.ముఖ్య అతిథిగా బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. భారతరత్న అవార్డు గ్రహీత పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా సేవలందించిన డాక్టర్. బిథాయ్ చంద్రరాయ్ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు దేశాలలో ఈ వేడుకలను జరుపుకుంటారన్నారు. ఆరోగ్య సమాజం లక్ష్యంగా ఎంచుకొని అంకిత భావంతో నిస్వార్ధంగా రోగులకు సేవ చేయడమే వైద్యుల గురుతర బాధ్యత. ఆ దిశగా విద్యార్థులు బాగా చదివి, వైద్య వృత్తిలో స్థిరపడి, బడుగు, పేద ,వర్గాల ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని అప్పుడే మంచి గుర్తింపు లభిస్తుందని గుర్తుచేశారు. విద్యార్థులు వైద్యుల వేషధారణతో వచ్చి భవిష్యత్తు లక్ష్యానికి అనుగుణంగా చక్కని ఉపన్యాసం ఇచ్చారు. ప్రదర్శనలు చేశారు.బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ పి. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో వైద్య రంగంలో రాణిస్తూ దేశానికి సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్.సి.సి థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్, ఉపాధ్యాయులు రమేష్, రవీందర్ రెడ్డి, రాజేష్, రాజు , ప్రీతి, అనిత,పూర్ణిమ,రాజ్ కుమార్, సునీత, ప్రద్యుమ్న విద్యార్థులు పాల్గొన్నవారు.
నర్సంపేట పట్టణంలో జాతీయ వైద్యుల దినోత్సవం వేడుకలు..
బాలాజీ విద్యాసంస్థలలో ఒక్కటైన అక్షర ద స్కూల్, ద్వారకపేటలోని గల బాలాజీ
ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్లో జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని డాక్టర్స్ డే ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ
కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు డాక్టర్స్ వేషధారణలతో అందరిని అలరించారు.ఈ కార్యాక్రమానికి బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, టెజరర్
డాక్టర్ వనజ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల సెక్రెటరి డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి ,బాలాజీ
ఇంటిగ్రేటెడ్ ప్రిన్సిపాల్ జ్యోతి గౌడ్ ,అక్షర ద స్కూల్ ప్రిన్సిపాల్ జి. భవాని, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.