అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం.!

Gram Panchayats

గ్రామ పంచాయితీల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం = ఎంపీడీవో ఇందిరమ్మ.

ఆర్ సి పురం లో ఘనంగా జాతీయ. పంచాయతీరాజ్ దినోత్సవం

పంచాయతీ సిబ్బందిని ఘనంగా సన్మానించిన నేతలు.

రామచంద్రపురం(
నేటి ధాత్రి) ఏప్రిల్ 24:

 

 

దేశానికి పట్టుకొమ్మలైన గ్రామ పంచాయతీల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీడీవో ఇందిరమ్మ అన్నారు, గురువారం మండలంలోని చుట్టుగుంట రామాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ కె సుబ్రహ్మణ్యం రెడ్డి అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి పి చంద్రశేఖర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభింపజేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. సర్పంచ్ కే సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ గ్రామపంచాయతీల సర్వతోముఖాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అందరి సహకారం అందించాలని కోరారు. టిడిపి సీనియర్ నాయకుడు‌ కొట్టే నరసింహారెడ్డి మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో అభివృద్ధి కుంటి బడిందన్నారు.. కూటమి ప్రభుత్వ హయాంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్ లో
జమ చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ లు గ్రామీణాభివృద్ధి కోసం సీసీ రోడ్లు, మురికినీటి కాలువల నిర్మాణం, తాగునీటి పథకాలు, స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. పంచాయతీ కార్యదర్శి పి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సి రామాపురం గ్రామపంచాయతీని సమస్యల రహిత పంచాయితీగా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.ఇంటి పన్ను,తాగునీటి కనెక్షన్ పన్నులను సకాలంలో చెల్లించి పంచాయతీ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని ప్రజలను కోరారు. పంచాయతీలోని గ్రామాలలో పరిసరాల పరిశుభ్రత, ఈ వేస్ట్ సేకరణ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను, సిబ్బందిని, స్థానిక టిడిపి నాయకులు కె. గిరిధర్ రెడ్డి, ముద్దు కృష్ణారెడ్డి, ముని రామిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి,రంజిత్ కుమార్ రెడ్డిలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్లు, వీఆర్ ఓ
ఝాన్సీ,డిజిటల్ అసిస్టెంట్ భరత్ కుమార్ రెడ్డి,బిల్ కలెక్టర్ సుబ్రహ్మణ్యం, పంచాయతీ కార్యాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!