నేటి ధాత్రి జమ్మికుంట
డెంగ్యూ నివారణ: సురక్షితమైన రేపటి కోసం మన బాధ్యత .
జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఈరోజు జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆరోగ్య ఉప కేంద్రాల లో వైద్య సిబ్బంది జాతీయ డెంగ్యూ దినోత్సవం ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ప్రజలకు డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పించడం జరిగింది భారతదేశంలో మే 16న జాతీయ డెంగ్యూ దినోత్సవం జరుపుకుంటారు
ఏడిస్ దోమ కాటు వల్ల డెంగ్యూ వస్తుంది
జ్వరాలు ఎక్కువగా దోమల వల్ల వస్తుంటుంది. కాబట్టి ముందు వాటిని తరిమేయాలి.
ఇంట్లోకి రాకుండా దోమ తెరలు వాడాలి,
చిన్న చిన్న జాగ్రత్తలతో డెంగీ, మలేరియా, చికన్ గున్యా లాంటి జ్వరాలు రాకుండా ఉండాలంటే తొలుత దోమలను పూర్తిగా నియంత్రించాలి.
దోమలను పారదోలే మందులను ఉపయోగించాలి. సాయంత్రం వేళల్లో ఇంట్లోకి దోమలు కాకుండా కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి.
ఇంటి చుట్టూ పరిసరాలను ఎప్పటికప్పుడూ క్లీన్ చేసుకోవాలి. పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూసుకోవాలి. పాత సామాన్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి.
పూలకుండీలు, డ్రమ్ములు, డబ్బాల్లో నీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి. తాజానీటిని కూడా కాచి చల్లార్చి తాగాలి. నీటి ద్వారే ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. కాబట్టి శుద్ధమైన నీటినే తాగాలి.
ఈ అవగాహన ర్యాలీలో ఎం ఎల్ హెచ్ పి డాక్టర్స్ ఫర్హానుద్దీన్, కార్తీక్, మహోన్నత,హిమబిందు, చందన,సంధ్యారాణి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శంకర్ రెడ్డి గారు సూపర్వైజర్స్ రత్నకుమారి, అరుణ,స్వరూప, సదానందం ఆరోగ్య శాఖ సిబ్బంది మరియు ఆశాలు తదితరులు పాల్గొన్నారు