
Mrs. Tallapalli (Mothukula) Bhagyalakshmi,
సిరిసిల్ల కవయిత్రికి జాతీయ పురస్కారం
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రముఖ ఉపాధ్యాయురాలు,కవయిత్రి శ్రీమతి తాళ్లపల్లి (మోతుకుల) భాగ్యలక్ష్మి,శ్రీ గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ,శ్రీ ఆర్యాణి సకల కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్ ఫిలింభవన్ లో జాతీయస్థాయి 2025 భారత్ విభూషణ్ అవార్డుల ప్రదానోత్సవం లో పురస్కారం అందించడం జరిగినది. మరియ తల్లీ నీకు వందనం కవితాసంకలనం ఆవిష్కరణ మహోత్సవంలో అద్భుతమైన కానుక అమ్మ కవిత ముద్రణకు ఎంపికైన సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గౌతమేశ్వర సేవా సంస్థ మరియు ఆర్యాణి కళా సంస్థల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ దూడపాక శ్రీధర్, డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్, ప్రతిమ హాస్పిటల్ డెర్మటాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ గీతారెడ్డి , డాక్టర్ మోత్కుల నారాయణ గౌడ్, ప్రముఖ సాహితీవేత్తలు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు.