
England vs India women
ఇంగ్లండ్ నిలిచింది
భారత మహిళలతో జరుగుతున్న మూడు వన్డేల సిరీ్‌సలో ఇంగ్లండ్ జట్టు తమ ఆశలను సజీవంగా నిలుపుకొంది. కచ్చితంగా గెలిచి తీరాల్సిన రెండో వన్డేలో నాట్ సివర్ సేన ఆల్‌రౌండ్ ప్రదర్శన…
లండన్: భారత మహిళలతో జరుగుతున్న మూడు వన్డేల సిరీ్‌సలో ఇంగ్లండ్ జట్టు తమ ఆశలను సజీవంగా నిలుపుకొంది. కచ్చితంగా గెలిచి తీరాల్సిన రెండో వన్డేలో నాట్ సివర్ సేన ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చింది. ఫలితంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 8 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రస్తుతం సిరీ్‌సలో ఇరు జట్లు 1-1తో నిలవగా.. ఆఖరి మ్యాచ్ మంగళవారం జరుగుతుంది. వర్షం కారణంగా నాలుగు గంటలు ఆలస్యంగా ఆరంభమైన ఈ మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించగా.. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 8 వికెట్లకు 143 పరుగులు చేసింది. మంధాన (42), దీప్తి శర్మ (30 నాటౌట్) మాత్రమే రాణించారు. ఎకెల్‌స్టోన్‌కు 3.. ఎర్లాట్, లిన్సే స్మిత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో మరోసారి వర్షం ఆటంకం కలిగించింది. దీంతో లక్ష్యాన్ని 24 ఓవర్లలో 115 రన్స్‌గా నిర్ణయించారు. ఓపెనర్లు అమీ జోన్స్ (46 నాటౌట్), బ్యూమంట్ (34)ల ధాటికి ఇంగ్లండ్ 21 ఓవర్లలో 116/2 స్కోరుతో మ్యాచ్‌ను ముగించింది.