హెల్త్ హబ్ గా నర్సంపేట డివిజన్

హెల్త్ హబ్ గా నర్సంపేట డివిజన్

జెట్ స్పీడ్ లో నర్సంపేట మెడికల్ కళాశాల.

రూ.183 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేసీఆర్ ప్రభుత్వం

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట డివిజన్ హెల్త్ హబ్ గా మారింది.ఇప్పటికే 450 పడకల జిల్లా ఆసుపత్రి నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి.డివిజన్ వ్యాప్తంగా పల్లె దవాఖనాలలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.కాగా కొన్ని చోట్ల దవాఖానల నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో వేగంగా సాగుతున్నాయి.దీంతో వైద్య ఆరోగ్య పరంగా
నర్సంపేట అభివృద్ధిలో జెడ్ స్పీడ్ లో దూసుకుపోతుంది.ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అధ్వర్యంలో అన్ని రంగాల్లో మునుపెన్నడూ లేని అభివృద్ధి నర్సంపేటలో చేసి చూపిస్తున్నారు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.ఇటివల నర్సంపేటకు ప్రభుత్వ మెడికల్ కళాశాలు మంజూరైన విషయం తెలిసిందే.కాగా అనుమతులు సైతం మంజూరయ్యాయి..తెలంగాణ ప్రభుత్వం తాజాగా మెడికల్ కళాశాలకు 183 కోట్ల రూపాయల నిదులను కేటాయిస్తూ జీవో-162 ను విడుదల చేసిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. త్వరలో టెండర్ ప్రక్రియ ప్రారంభమై,వచ్చే నెలలో పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 450 పడకల జిల్లా ఆసుపత్రి అలాగే 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ పనులు పూర్తి కావస్తున్నాయని చెప్పారు. నర్సంపేట పేదలకు మెరుగైన వైద్యం,పేద విద్యార్థులకు వైద్య విద్య అందనుందన్నారు.వైద్యరంగంలో కొత్త విప్లవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చారాన్నారు.ఒకనాడు వైద్య విద్య రాజదానిలకు మాత్రమే పరిమితమయ్యేదని దీంతో మెడికల్ సీటు దక్కాలంటే చాలా కష్ట పరిస్థితులు ఉండేవని నేడు పేద మధ్య తరగతి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి పేదలకు వైద్య విద్యను చేరువ చేసారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.నర్సంపేట హెల్త్ హబ్ గా మారనున్న నేపథ్యంలో పేద విద్యార్థులకు వైద్య విద్య చేరువవడంతో పాటు,పేదవాడికి కార్పోరేట్ స్థాయి వైద్యం అందనుందని తెలిపారు. ఇంత గొప్ప అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టీ.హరీష్ రావులకు, సహకరించిన జిల్లా మంత్రులకు పెద్ది సుదర్శన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!