నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట రూరల్ మండలంలోని నర్సంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ చైర్మన్ మురాల మోహన్ రెడ్డి భారత్ రాష్ట్ర సమితి (బిఅర్ఎస్)
పార్టి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిరూపణ కావడంతో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయనను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు మండల పార్టి అధ్యక్షుడు నామాల సత్యనారాయణ తెలిపారు.పార్టీ పేరు చెప్పుకోని ఏవైనా చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే బి ఆర్ ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.కాగా మోహన్ రెడ్డి సొసైటీ డైరెక్టర్ గా కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొంది బీఅర్ఎస్ పార్టీకి చేరి సొసైటీ చైర్మన్ పదవి పొందాడు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.