కేతకిలో ప్రత్యేక పూజలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలో ఝరాసంఘం మండలం కేంద్రంలో దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన దేవాలయం శ్రీ కేతక సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం అమావాస్య సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవ్ రెడ్డి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేకి ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు ఎమ్మెల్యే వారికి శాలువాతో సన్మానించారు.