నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
చండూరు మండల పరిధిలోనినేర్మట గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ కార్మికుడు నారాపాక శంకర్ మాతృమూర్తి వల్లమ్మ (76) అనారోగ్యంతో కన్నుమూశారు. నల్లగొండలోనిఆసుపత్రిలో ఆదివారం సాయంత్రం 7 గంటలకుఆమె తుది శ్వాస విడిచారు. గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ చండూరు మండల కమిటీ ( సిఐటియు) ఆధ్వర్యంలో పూలమాలలు వేసినివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ గౌడ్ మాట్లాడుతూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబానికి ఎల్లప్పుడూసీఐటీయూ అండగా ఉంటుందనివారు తెలిపారు.ఈ కార్యక్రమంలోవారి కుమారుడు నారాపాక శంకర్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ చండూరు మండల అధ్యక్షులునాంపల్లి శంకర్, మండల సహాయ కార్యదర్శివెంకటాచారి,మండల ఉపాధ్యక్షులు నాగిళ్ల లక్ష్మణ్, మండల నాయకులు ఈరటి దేవరాజ్, నారపాక యాదయ్య,నారపాక మల్లయ్య, లక్ష్మయ్య, లక్ష్మమ్మతదితరులు పాల్గొన్నారు.
నారా పాక శంకర్ కు మాతృవియోగం
