Complaint Filed Over Nampally Forensic Lab Fire
నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం.. పోలీసులకు ఫిర్యాదు..
నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్లో ప్రాపర్టీ రూమ్లో నిన్న(శనివారం) అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీవాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు..
నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్లో ప్రాపర్టీ రూమ్లో నిన్న(శనివారం) అగ్ని ప్రమాదం (Nampally Forensic Lab Fire Accident) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీవాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మొదట ప్రాపర్టీ రూమ్లో భారీగా నల్ల పొగతో కూడిన మంటలు వ్యాపించాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత మంటలు ఇతర గదులకి వ్యాపించాయని తెలిపారు. శనివారం ఉదయం 10.08 గంటలకు అగ్ని ప్రమాదం జరిగిందని ఫిర్యాదులో వెల్లడించారు.
