# కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ రీసర్చ్ యూనివర్సిటీ పనులకు శంకుస్థాపన
# రైతులకు ఆదాయం పెంచడం కోసం
రీసర్చ్ స్టేషన్ ఉపయోగం
# రైతులకు అన్ని రంగాల్లో కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట
# నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
# శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
నల్లబెల్లి,నేటిధాత్రి :
ఉద్యానవన పంటల అభివృద్ధి కోసం నల్లబెల్లి మండలంలో పునాదిరాయి పడింది.దీంతో తెలంగాణ రాష్ట్రంలో నల్లబెల్లి మండలం చరిత్ర పుటల్లోకి ఎక్కిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. నల్లబెల్లి మండలంలోని కన్నరావుపేట గ్రామంలో హార్టికల్చర్ రీసర్చ్ యూనివర్సిటీని కేసీఆర్ ప్రభుత్వం ఇటీవల మంజూరి చేసింది.కాగా శుక్రవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నారావుపేట గ్రామంలో కొండ లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ రీసర్చ్ స్టేషన్ యూనివర్సిటీ పనులకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి శంకుస్థాపన చేశారు.గ్రామ సర్పంచ్ నిర్మల రవీందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ 2001లో జడ్పిటిసి గా మండల ప్రజలు ఆశీర్వదించగా ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నానని రాజకీయాలలో శత్రువులు మిత్రులు ఎప్పటికీ శాశ్వతం కాదని ప్రజల సంక్షేమమే నాయకుని లక్ష్యమని అదే స్ఫూర్తితో నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తితో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించే దిశగా పనిచేస్తుందని అదేవిధంగా రాష్ట్రంలో మొట్టమొదటి హార్టికల్చర్ రీసర్చ్ సెంటర్ యూనివర్సిటీ నేను పుట్టిన మండలం గడ్డపై శంకుస్థాపన చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని గతంలో శాసనసభ్యులుగా ఉన్న వారు నియోజకవర్గ అభివృద్ధిపై పిచ్చికూతలు కోస్తున్నారని దమ్ముంటే మీ పాలనలో ఏమి అభివృద్ధి చేశారు నేను చెప్తా… ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాట తర్వాత నర్సంపేట నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మీకు చెప్పే దమ్ముందా.. నేను ఎమ్మెల్యేగా ఉండి నా శక్తి మేరకు రెండు సంవత్సరాల కరోనాకాలం సంభవించిన ప్రతి పల్లెకు ఏదో రకంగా ప్రభుత్వ సంక్షేమాలపథకాలను అందించే విధంగా కృషి చేస్తూ ప్రతి గ్రామంలో కొత్త బీటీ రోడ్లు, సిసి రోడ్లు 100% ఏర్పాటు చేయడం జరిగిందని ఇప్పటికే కన్నారావుపేట గ్రామానికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అందించడం జరిగిందని మిగిలిపోయిన రైతులకు తప్పకుండా పట్టాలు ఇప్పించే బాధ్యత నాది అభివృద్ధి చేసే వ్యక్తి కావాలా.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తి కావాలో మీరే ఆలోచించాలి ఒక మధ్యతరతి రైతుబిడ్డగా రైతాంగ బాధలు తెలుసుకొని నియోజకవర్గాన్ని రెండు పంటలు పండించే విధంగా గోదావరి నీళ్లతో రైతుల పాదాలు కడిగానని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు మళ్లీ మీ పెద్ద మనసుతో ఆశీర్వదించాలని ఆయన అన్నారు అనంతరం గత మార్చిలో పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహార చెక్కులను ఎమ్మెల్యే చేతులమీదుగా రైతులకు అందజేశారుకార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్, ఓడిసిఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ ఉడుగుల సునీత ప్రవీణ్ గౌడ్, వైస్ ఎంపీపీ గందే శ్రీలత శ్రీనివాస్ గుప్తా, పిఎసిఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్, మాజీ ఎంపీపీలు శ్రీనివాస్ గౌడ్, సారంగపాణి, వైస్ ఎంపీపీ రాజేశ్వరరావు, ఏ డి ఏ శ్రీనివాస్, ఏవో పరమేశ్వర్, సర్పంచులు, ఎంపిటిసిలు, క్లస్టర్ ఇన్చార్జిలు, మండల నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.