#మండల కేంద్రాన్ని పోలీసుల అదుపులోకి తీసుకున్న వైనం.
#భయం గుప్పెట్లో మండల కేంద్ర ప్రజలు.
#పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు.
#తీవ్రమైన వాగ్వాదాల మధ్య సజావుగా సాగని గ్రామసభ.
#అసహానికి గురై స్టేజి దిగి ప్రజలతో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే మాధవరెడ్డి.
#అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
#ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.
నల్లబెల్లి నేటి ధాత్రి: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాల ప్రజా పాలన గ్రామసభ నేపథ్యంలో వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది అల్లర్లు జరుగుతాయని ముందస్తు సమాచారంతో జిల్లా పోలీసు యంత్రాంగం ఉదయం నుండే మండల కేంద్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని వందలాది మంది పోలీసులు ఒక్కసారిగా మండల కేంద్రంలో కనబడడంతో మండల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు అసలు ఏం జరుగుతుందని ఆలోచనలో పడి బిక్కు బిక్కుమంటున్నారు గ్రామసభలో నిరుపేద ప్రజలు దరఖాస్తు చేసుకోవాలంటేనే పోలీసుల అలజడిని చూసి జంకే పరిస్థితి నెలకొన్నది ఇది ఇలా ఉండగా ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన గ్రామసభ ఆలస్యంగా ప్రారంభం కాగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మండల కేంద్రానికి చేరుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున ఘన స్వాగతం పలికి గజమాల వేశారు అనంతరం బాణాసంచా పేల్చారు. గ్రామపంచాయతీ ఇంచార్జ్ తాసిల్దార్ ముప్పు కృష్ణ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మాధవరెడ్డి హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పథకాలు రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు కోసం ప్రభుత్వం గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నల్లబెల్లి గ్రామసభకు రావడం సంతోషంగా ఉన్నదని అన్నారు సంక్షేమ పథకాలలో రాజకీయాల కు అతిథికంగా అర్హులైన ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందే విధంగా చేయడం జరుగుతుందని ఎలాంటి కారణాలతో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు పథకాలు మంజూరు కాకపోతే వెంటనే మరల దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి తప్పకుండా మంజూరు చేయడం జరుగుతుందని దానికి అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తొందరపడి ఎవరో చెప్పిన మాయ మాటలలో పడి అసహానికి గురికా వద్దని ఇది నిరంతర ప్రక్రియని ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలకు అండగా ఉండడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
#అసహనానికి గురై ప్రజలతో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే దొంతి.
ఎమ్మెల్యే మాదిరెడ్డి ప్రసంగం ముగించగానే గ్రామ ప్రజలు పథకాలలో వ్యవహరిస్తున్న అమలుతీరుపై ఎమ్మెల్యేను నిలదీయడంతో తీవ్ర ఉద్రిక్తతకు సభ దారి తీసింది ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవాలని ప్రయత్నించగా పోలీసు యంత్రాంగం అడ్డుపడగా ప్రజలు మరింత ఆగ్రానికి లోనై సభ అంత రసా బసగా సాగడంతో ఒకింత అసహానికి గురైన ఎమ్మెల్యే స్టేజ్ దిగి మరి ప్రజలతో వాగ్వాదానికి దిగడంతో ఎమ్మెల్యే చేసిన తీరును ప్రజలు ఖండించారు. కొందరు కావాలనే సభను సజావుగా కాకుండా రాజకీయ లాభాపేక్ష కోసం రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే మాధవరెడ్డి ఆక్రోషం వెళ్లబుచ్చారు. ప్రజల ఆవేదనని గుర్తించిన ఎమ్మెల్యే తప్పకుండా ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ నల్లబెల్లి గ్రామానికి మరిన్ని ఎక్కువ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చి వెనుతిరి గారు.
#మండల కేంద్రాన్ని పోలీసుల అదుపులోకి తీసుకున్న వైనం.
నల్లబెల్లి మండల కేంద్రంలో గ్రామసభ ఏర్పాట్లు భాగంగా ఈ సభకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరవుతున్నారు అలాగే ప్రతిపక్ష నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే మండల కేంద్రానికి చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి గ్రామసభకు గులాబీ శ్రేణులతో కలిసి హాజరవుతున్నారని ప్రచారం జరిగింది ఈ సమాచారం ముందస్తుగా జిల్లా పోలీసు యంత్రాంగ నికి తెలవడంతో మండల కేంద్రంలో భారీ ఎత్తున పోలీసులు చేరుకొని గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకోగా ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు గతంలో ఎప్పుడు కూడా గ్రామ సభకు ఇంత పెద్ద ఎత్తున పోలీసులు రాకపోవడంతో అసలు గ్రామంలో ఏం జరుగుతుందని ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. మండల కేంద్రంలో వాణిజ్య వ్యాపారాలు అధికంగా ఉండడం. జన సందోహం వలన ముందుగానే పోలీసులు దుకాణాలను ఎక్కడికక్కడ మూసి వేయించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యారు డిసిపి రవీందర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల నుండి వందలాది మంది పోలీసులతో ప్రజలను కట్టు దిట్టంచేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో సరైన అర్హులైన లబ్ధిదారులకు లబ్ధి చెందుతూ లేదని ఎమ్మెల్యేను ప్రశ్నించడంతో ప్రజలపై పోలీసుల పనితీరు ప్రత్యక్షంగా ప్రభుత్వానికి అండగా ఉండే విధంగా వ్యవహరించిన తీరు ప్రజలకు మింగుడు పడడం లేదు ఏమైనాప్పటికీ శాంతి భద్రతలే పరిరక్షణగా మా బాధ్యతను మేము నెరవేరుస్తున్నామని జిల్లా పోలీస్ శాఖ స్పందించారు. సభ ముగిసిన తర్వాత కూడా రోడ్లపై అల్లరి ముఖాలు ఎలాంటి విద్వాంసానికి పాల్పడకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డిఓ, ఉషారాణి, ఏసిపి కిరణ్ కుమార్, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి గోవిందరాజన్, ఎంపీడీవో, సిఐలు, ఎస్సైలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.