నాయిని రాజేందర్ రెడ్డి కి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి
వినయ భాస్కర్ ను
భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి

బిఆర్ఎస్వి కేయూ అధ్యక్షులు బైరపాక ప్రశాంత్

10వ డివిజను బిఆర్ఎస్వి నూతన కమిటీ నియామకం

హన్మకొండ, నేటిధాత్రి:

తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్, దాస్యం వినయ భాస్కర్ గారి ఆదేశాల మేరకు 10వ బి ఆర్ ఎస్ వి నూతన ఇంచార్జ్ గా మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ మరియు ప్రెసిడెంట్ గా నుమాన్ ఖాన్ &కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా బిఆర్ఎస్వి కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి కి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఏనాడు కనిపించని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని, తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబాబాద్ లో తుపాకితో విద్యార్థుల కాల్చిన చరిత్ర నీదని, ఆ ఘటనను ఉద్యమకారులు ఎవరు మర్చిపోలేదని, బిఆర్ఎస్ పార్టీ పై దుష్ట ప్రచారాలు మానుకోవాలని, కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రాజకీయాల కోసం వ్యక్తిగత విమర్శలు చేయడం సరియైన విధానం కాదని,
వినయ భాస్కర్ పేదల నాయకుడని, కష్ట సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్న నాయకుడని, కాంగ్రెస్, బిజెపి మాయ మాటలు విద్యార్థులు,యువత నమ్మరని, కెసిఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో 10 వ డివిజన్ అధ్యక్షుడు ఖలీల్, బిఅర్ఎస్వీ నాయకులు పస్తం అనిల్,ఉమెరు, షాయాబ్, పిట్టల కళ్యాణ్,యూత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *