ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు
శాలువాతో సత్కరించిన అరుణ ఫర్టిలైజర్ యాజమాని వెంకన్న
పరకాల:నేటిధాత్రి
వరంగల్ హనుమకొండ జిల్లా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగూర్ల వెంకన్న మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైనారు.ఈ సందర్బంగా అరుణ ఫర్టీలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రైటర్ గందే వెంకటేశ్వర్లు హార్దిక శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు.గత 35 సంవత్సరాలుగా ఫర్టిలైజర్స్,పెస్టిసైడ్స్అండ్ సీడ్స్ రంగంలో వరంగల్ హనుమకొండ జిల్లా ఫర్టిలైజర్ అసోసియేషన్ కి ఎనలేని సేవలు అందిస్తూ ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తూ ఎరువుల పురుగుమందులు విత్తనంపై దుకాణాల యజమానుల సమస్యలను తెలుసుకొని సమస్యల పరిష్కారానికి అనునిత్యం కృషి చేస్తూ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు గందే వెంకటేశ్వర్లు ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.