
Naga Panchami
ఆర్కేపీలో నాగుల పంచమి వేడుకలు…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
పవిత్ర శ్రావణమాసంలో మహిళలు జరుపుకునే తొలి పండుగ నాగుల పంచమి.భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పూజించే వారికి నాగ పంచమి శుభాలను అందిస్తుంది.శ్రావణ మాసం అంటేనే శుభకరం.. మంగళకరం. అలాంటి మాసంలో పర్వదినాలు చాలా ఉన్నాయి. ఈ మాసంలో వచ్చే తొలి పండగ నాగ పంచమి. మంగళవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని విజయ గణపతి దేవాలయంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలంతా ఉదయం నుండి దేవాలయం ప్రాంగణంలోని పుట్ట దగ్గర నాగ దేవుడికి పాలు పోసి, కొబ్బరికాయలు కొట్టి నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని నాగదేవతకు మొక్కుకున్నట్లు పలువురు మహిళలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారులు రాజేందర్ శర్మ, సతీష్ శర్మ లు మాట్లాడారు. హిందువులు పాములను నాగేంద్ర స్వామి దైవంగా భావించి పూజలు చేస్తారని, నాగేంద్ర స్వామిని పూజించేందుకు నాగుల చవితి తర్వాత నాగపంచమి రోజున పుట్టలో పాలు పోసి ప్రత్యేకంగా పూజలు చేస్తారని తెలిపారు.