
Nagula Panchami.
వైభవంగా నాగుల పంచమి వేడుకలు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాత నమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాల యంలో ఉన్న నాగేంద్ర స్వామి గుడిలో మంగళవారం నాగుల పంచమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రావణమాసం పురస్కరించుకొని దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమా చారి నాగదేవతల విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించినారు. దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి రాజ మణి దంపతులు పుట్టలో పాలు పోసి వెండి నాగమయ ప్రతిమను వస్త్రాలను సమ ర్పించి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి భక్తిశ్రద్ధలతో నాగదేవతలను తమ కోరికలు నెరవేర్చాలని వేడుకున్నారు ఈ కార్యక్రమం లో బాసని రమేష్ ధనలక్ష్మి మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.