₹80,000 Ardhanareeshwara Ornament Donated
కోటగుళ్ళకు రూ.80 వేలతో నాగేంద్ర సహిత అర్ధనారీశ్వర తొడుగు బహుకరణ
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలోప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ కు ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన తౌటిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వర్ణలత దంపతులు ఆలయానికి నాగేంద్ర సహిత అర్ధనారీశ్వర తొడుగును రూ 80 వేలతో శుక్రవారం బహుకరించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి స్వర్ణలత దంపతులు స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలను సమర్పించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయానికి అర్ధనారీశ్వర తొడుగును బహూకరించిన భాస్కర్ రెడ్డి, స్వర్ణలత దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.ఈ కార్యక్రమంలో నగరంపల్లి మాజీ సర్పంచ్ మాదాడి సత్యలక్ష్మి నారాయణరెడ్డి, బైరెడ్డి మహేందర్ రెడ్డి ,రమాదేవి, కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి శైలజ దంపతులు పాల్గొన్నారు.
