
President Nagendra.
టిడబ్ల్యూజేఎఫ్ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులుగా నాగేంద్ర
పరకాల నేటిధాత్రి
టిడబ్ల్యూజేఎఫ్ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులుగా గూడెల్లి నాగేంద్ర ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది.శుక్రవారం హనుమకొండ ప్రెస్ క్లబ్ లో జరిగిన జిల్లా మహాసభల్లో నాగేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ప్రకటించారు.ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన రాష్ట్ర జిల్లా నాయకులకు నాగేంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు.జర్నలిస్టు సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ టిడబ్ల్యూజేఎఫ్ ఎలక్ట్రానిక్ మీడియా విభాగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.ఈ సందర్భంగా పలువురు నాగేంద్రకు అభినందనలు తెలియజేశారు.