
# పాల్గొన్న మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని శాంతినగర్ లో రాజ శ్యామల ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ రాజ శ్యామల నాగామృత లింగేశ్వర స్వామి శివ పంచాయతన ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.గత నాలుగు రోజులుగా వివిధ పూజలు నిర్వహిస్తూ ఐదవ రోజు అశ్విని నక్షత్ర యుక్త మేష లగ్నములో లలితా మాత ఆవిర్భవించిన రోజు కావడంతో శ్రీ రాజ శ్యామల సహిత నాగమృత లింగేశ్వర స్వామి వారి యంత్ర, విగ్రహ ప్రతిష్ట మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగ రుత్వికుల వేదమంత్రోచ్ఛాల నడుమ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని వెన్నంపల్లి వెంకట సత్యనారాయణ శర్మ, నిశాంతి శర్మ అవధాని, నారాయణ శర్మ ,రాజమండ్రి వాస్తవ్యులు నరేష్ శర్మ, మల్లికార్జున శర్మ , అయినవోలు కృష్ణమూర్తి,వేద బ్రాహ్మణులు నిర్వహించగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ దంపతులు ,పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ పాలాయి రవికుమార్, శ్రీరామల శంకరయ్య కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్, రేమిడి శ్రీనివాస్ వేమిశెట్టి శ్రీనివాస్ దంపతులు భక్తులు పాల్గొన్నారు.అనంతరం వేముల సాంబయ్య గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీ మాతాంగి రాజేష్ శ్యామల నాగమృత లింగేశ్వర స్వామిని కోరుకున్నట్లు తెలిపారు.