నడికూడ,నేటి ధాత్రి:
గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగస్తులు గా నడికూడ మండల తహాసిల్దార్ గుండాల నాగరాజు, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్,మండల తహాసిల్దార్ కార్యాలయ రికార్డ్ అసిస్టెంట్ రాణి లను ఎంపిక చేయడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, సి పి. అంబర్ కిషోర్ జూ మరియు ట్రైనింగ్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ఉత్తమ అవార్డులను కలెక్టర్ సిక్తా పట్నాయక్ చేతుల మీదుగా వారికి అందజేయడం జరిగింది. అనంతరం అవార్డు గ్రహీతలు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఉత్తమ అవార్డు అందుకున్న నడికూడ మండల తహాసిల్దార్, ఎంపీడీవో
