నర్సంపేట,నేటిధాత్రి :
బాలవికాస అధ్వర్యంలో నిర్వహిస్తున్న మంచినీటి సరఫరా ప్లాంట్స్ నిర్వహణ పట్ల గురువారం 3 రాష్ట్రాల మహాసభ ఖాజీపేటలో జరిగింది. ఈ మహాసభలో దుగ్గొండి మండలంలోని నాచినపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్
పట్ల ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలవికాస వ్యవస్థాపకురాలు బాలక్క, ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ మెంబర్ పుచ్చకాయల కృష్ణారెడ్డి, ప్లాంట్ ప్రెసిడెంట్ ఆండ్ర రత్నాకర్ రెడ్డి, కోశాధికారి కన్నెబోయిన చంద్రమౌళి, కమిటీ సభ్యులు చెన్నూరి నరసింహారెడ్డి, కందకట్ల రఘుపతి, బండారి ఉప్పలయ్య, మెతకుపల్లి రవీందర్ రెడ్డి, ఆపరేటర్ బాబర్ తదితరులు పాల్గొన్నారు.