
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
బుధవారం రోజు జడ్చర్ల కేంద్రంలోని డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాక్ బృందానికి పూర్ణకుంభంతో శాస్త్రోక్తంగా కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సి.హెచ్. అప్పియ్య చిన్నమ్మ అధ్యాపకులు, అధ్యాపకేతరులు మరియు విద్యార్థిని విద్యార్థులు కలిసి స్వాగతం పలికారు. అనంతరం ఎన్ సీసీ విద్యార్థులచే న్యాక్ బృందం గౌరవ వందనము స్వీకరించారు. తర్వాత కళాశాల ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేయటం జరిగినది ఈ కార్యక్రమంలో న్యాక్ బృందం అధ్యక్షులు డా.టి.సి. తారనాద్ ఉపకులపతి హసన్ విశ్వవిద్యాలయం కర్ణాటక, నిర్వాహక సభ్యులు ప్రొ. కె. జై చంద్రారెడ్డి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి, సభ్యులు డా.బిమల్ బరాహ్ జోర్హాట్ అస్సాం, కళాశాల విశ్రాంత ప్రధాన ఆచార్యులు మరియు తెలంగాణ ఉన్నత విద్యాశాఖ సంయుక్త సంచాలకులు ప్రో. డి.యస్. ఆర్. రాజేందర్ సింగ్ సందర్శించారు. కళాశాల ప్రధానాచార్యుల చాంబర్లో కళాశాల ప్రధానాచార్యులు ప్రో. సీహెచ్. అప్పియ చిన్నమ్మ గారు న్యాక్ బృందానికి కళాశాల కార్యకలాపాల గురించి విద్యాభివృద్ధి గూర్చి పిపిటిల ద్వారా వివరించారు. ఆ తర్వాత న్యాక్ బృందం కళాశాలలోని ప్రతి విభాగాన్ని సందర్శించి అన్ని రకాల రికార్డులను పరిశీలించారు తర్వాత ఈ డి సి , ఎన్ సీసీ , ఎన్ ఎస్ ఎస్ -1,2,3,4 యూనిట్ల, మహిళా సాధికారత విభాగం, నీటి సంరక్షణ కేంద్రం, బాలసదనం, కంప్యూటర్ ప్రయోగశాల, రెడ్ రిబ్బన్ క్లబ్, యూత్ రెడ్ క్రాస్, ఫిర్యాదుల పరిష్కార విభాగం, అంతర్గత ఫిర్యాదుల కమిటీ, యాంటీ రాగింగ్, కెరీర్ గైడెన్స్ సెల్, ప్లేస్మెంట్ సెల్, గ్రంథాలయము, జిమ్నాసియం, ఆరోగ్య కేంద్రం, పూర్వ విద్యార్థులతో సమావేశం, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం, విద్యార్థినీ విద్యార్థులతో సమావేశం, యోగా కేంద్రం, తెలంగాణ రాష్ట్రం హెర్బెరియం కేంద్రం, సెమినార్ హాల్, ఇండోర్ స్టేడియం, ఐ క్యూ ఏ సి కేంద్రాలను సందర్శించారు. సాయంత్రము న్యాక్ బృందం ముందు కళాశాల విద్యార్థినీ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు ఇట్టి కార్యక్రమాలను న్యాక్ బృందం వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రధానాచార్యులు శ్రీ. శ్రీనివాసులు, అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రీ. బక్షి రవీందర్ రావు, సంస్కృతము, తెలుగు విభాగం ఎన్. సుభాషిని, హిందీ విభాగం డా. కె. నరసింహారావు కళ్యాణి, ఆంగ్ల విభాగం డా. ఆర్. రమాదేవి, గణిత విభాగం ఎల్. ప్రవీణ్ కుమార్, భౌతికశాస్త్ర విభాగం యు. ఉదయ్ కుమార్, కంప్యూటర్ సైన్స్ విభాగం డా. కె. మంజుల, రసాయన శాస్త్ర విభాగం ఎన్. సాయి కొండలు, జంతుశాస్త్ర విభాగం బక్షి రవీందర్రావు, వృక్షశాస్త్ర విభాగం శ్రీనివాసులు, సూక్ష్మజీవ శాస్త్ర విభాగం కె.నీరజ, కామర్స్ విభాగం డా. కె. మంజుల, చరిత్ర విభాగం సి. బీరయ్య, రాజనీత్ శాస్త్ర విభాగం పి. విజయ్ కుమార్, అర్థశాస్త్ర విభాగం ఆర్. నాగరాజు, ప్రభుత్వ పాలనా శాస్త్రం డా. సి.హెచ్. కవిత, ఎన్ సీసీ కన్వీనర్ లెఫ్టినెంట్ ఏ. యాదయ్య, తెలంగాణ బొటానికల్ గార్డెన్ కన్వీనర్ డా.సదాశివయ్య,ఆర్సీసీ కె. సుభాషిని, పిడి.సి.హెచ్. వెంకటేశ్వర్లు వివిధ విభాగాల అధిపతులు అధ్యాపకులు, టీ ఎస్ కే సి మార్గదర్శకులు ప్రతాప్ అధ్యాపకేతర మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.