
Manik Prabhu
నా తెలుగు భాష పుస్తకావిష్కరణ….
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని పద్మశాలి భవనంలో మాణిక్ ప్రభు పాఠశాల ఆవరణలో శనివారం నా తెలుగు భాష అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి జహీరాబాద్ సీనియర్ సివిల్(జడ్జ్) న్యాయమూర్తి గంటా కవితా దేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నా తెలుగు భాష అనే పుస్తకాన్ని రచయిత పివి భైరవన్ శర్మ రాశారు. ఈ కార్యక్రమం సమాచార్ న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా న్యాయ మూర్తి గంటా కవితదేవి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాని ప్రారంభించి నా తెలుగు భాష అనే పుస్తకాని ఆవిష్కరించారు. అనంతరం న్యాయమూర్తి గంటా కవితా దేవి మాట్లాడుతూ ముందుగా మాణిక్ ప్రభు పాఠశాల క్యారస్పాండెంట్ వెంకటయ్య ను అభినందించారు. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉపాధ్యాయులను, తల్లి తండ్రులకు మంచిపేరు తేవాలని అన్నారు. విద్యార్థిని విద్యార్థులు పది సంవత్సరాలు కష్టపడి చదివితే విద్యార్థుల జీవితాలు మంచి స్థాయిలో ఉంటారని, విద్యార్థులు మీ సంతకం గురించి వేరేవారు ఎదురుచూతారో అపోయూడు విద్యార్థులు సక్సెస్ అవుతారని అన్నారు. అనంతరం రచయిత భైరవన్ శర్మను న్యాయమూర్తి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమం లో జర్నలిస్ట్ లు వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ షేక్ మహేబూబ్, హరికృష్ణ, ఆకాష్, మహా రుద్రయ్య స్వామి, సంజీవ్ కుమార్, అత్తర్, రాజేందర్, యువరాజ్, మధు మాణిక్ ప్రభు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.