
# ఆశీర్వదిస్తే ఐదేళ్లు సేవకుడిగా పనిచేస్తా
# ఎమ్మార్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన రెడ్యా నాయక్
# రెడ్యా నాయక్ కు అపూర్వ స్వాగతం పలికిన అభిమానులు
# భారీగా తరలివచ్చిన అభిమానులు,ప్రజలు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు
# నామినేషన్ సందర్భంగా జనసంద్రమైన మరిపెడ బంగ్లా.
మరిపెడ నేటిధాత్రి.
డోర్నకల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి పనిచేస్తానని, నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే ఐదేళ్లు సేవకుడిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని అన్నారు,డోర్నకల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డిఎస్.రెడ్యానాయక్. బుధవారం స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.ఈసందర్భంగా నియోజకవర్గంలో పలు గ్రామాల నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు వేలాది మంది తరలివచ్చారు. మహిళలు మంగళహారతులు, బోనాలు,బతుకమ్మలతో ఘనంగా స్వాగతం పలికారు. రాజీవ్ గాంధీ చౌరస్తా నుండి మండల రెవిన్యూ అధికారి కార్యాలయం వరకు,సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఐనా యువత,నాయకులు, మహిళలు భారీ ర్యాలీ గా తరలివచ్చారు, ఈ సందర్భంగా అభిమానులు, కళ బృందాలు నృత్యాలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో డోర్నకల్ లో కంకణం కట్టుకొని రెడ్యానాయక్ ను గెలిపించే బాద్యత నాది అని నరేష్ రెడ్డి చెప్పారు,రెడ్యానాయక్ ను గెలిపించడం నా బాద్యత అని మంత్రి సత్యవతిరాథోడ్ మాట ఇచ్చారు, మీ పాలేరులా పనిచేసే రెడ్యానాయక్ ను గెలిపించి అధినేతకు కానుకగా ఇద్దామన్నారు,బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ధరంసోత్ రెడ్యానాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆశీస్సులతో డోర్నకల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానన్నారు. హ్యాట్రిక్ సీఎంగా కెసిఆర్ చరిత్ర సృష్టించబోతున్నారన్నారు, డోర్నకల్ నియోజకవర్గం సమగ్రాభివృద్ధి కొరకు ప్రజలంతా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.డోర్నకల్ నియోజకవర్గం ఇప్పటికే చాలా అభివృద్ధి చెందిందని,ఇంకా చెందాల్సి ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, నియోజకవర్గ పరిధిలో ని పెద్దల సలహాలు, సూచనలతో అభివృద్ధిని వేగవంతం చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజల సంపూర్ణ సహకారంతో డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తప్పకుండా గెలుపొందుతానన్న విశ్వాసం నాకు ఉందన్నారు. నియోజకవర్గo లో ని అందరి సహాయ సహాకారల తో ముందుకు వెళ్తామన్నారు, డోర్నకల్ గడ్డ పై బీఆర్ఎస్ జెండాను ఎగువేస్తానని స్పష్టం చేశారు.ప్రత్యేక ప్రణాళికతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు,ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ,స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్,మహబూబాబాద్ జిల్లా ఎంపి,జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాలోత్.కవిత,హాకా చైర్మన్ మచ్చ శ్రీనివాసరావు,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, జడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర్ రెడ్డి,డోర్నకల్ యువనేత డిఎస్. టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామసహాయం రంగారెడ్డి,మరిపెడ మున్సిపల్ చైర్మన్ సింధూర,ఎంపీపీ అరుణ రాంబాబు,జడ్పిటిసి శారద రవీందర్,పిఎసిఎస్ చైర్మన్ చాపల యాదగిరి రెడ్డి, కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి,మహబూబాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కత్తెరసాల విద్యాసాగర్,కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్,పిఎసిఎస్ వైస్ చైర్మన్ గండి మహేష్ గౌడ్,మండల, జిల్లా రైతు సమన్వయ సమితి డైరెక్టర్ కాలు నాయక్, మునిసిపల్ వైస్ చైర్మన్ బుచ్చిరెడ్డి,వైస్ ఎంపీపీ అశోక్ రెడ్డి,మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్,ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు తాళ్లపెళ్లి రఘు గౌడ్, మరిపెడ మండల పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి,డోర్నకల్ నియోజకవర్గo లో ని ఏడు మండల ల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు,జడ్పిటిసిలు, సర్పంచులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.