Leader Focused on Mudigunta Development
ముదిగుంట గ్రామ అభివృద్ధి నా లక్ష్యం
గెలుపు కోసం కాదు- మార్పు కోసమే నా ప్రయత్నం
డబ్బులు లేని రాజకీయమే నా ముఖ్య లక్ష్యం
ఊరుని లూటీ చేసేవాడు కాదు ఊరి కోసం డ్యూటీ చేసే టోడు సర్పంచ్ కావాలే
జైపూర్,నేటి ధాత్రి:
స్థానిక ఎన్నికల్లో సర్పంచిగా పోటీ చేస్తున్న యువ నాయకుడు గుండా సురేష్ గౌడ్ స్థానిక ఎన్నికల్లో గెలుపు సాధించడం కాదని,ప్రజలలో నిజమైన మార్పును తీసుకురావడం కోసం తన ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.ఆయన ప్రజల సంక్షేమం,అభివృద్ధి కోసం పని చేసే నాయకులనే ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.అదేవిధంగా ప్రజల మధ్య నమ్మకాన్ని పొందడం, వారికి మంచి సేవలను అందించడం తన ముఖ్యమని తెలిపారు.మొత్తానికి ఆయన స్థానిక ఎన్నికలలో గెలుపు కంటే ప్రజల్లో మార్పును తీసుకురావడమే తన ప్రయత్నమని స్పష్టం చేశారు.
