రేవంత్ రెడ్డి కి నా సూటి ప్రశ్న మీ కాంగ్రెస్ కర్ణాటకలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కర్ణాటకలో అమలు చేయండి

 

ప్రతి అకౌంట్లో 15లక్షలు‌ జమ చేసిన తర్వాత బీజేపీ నాయకులు ఓట్లు అడగాలి.

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

కొడిమ్యాల (నేటి ధాత్రి ):
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో మున్నూరుకాపు ఫంక్షన్ హాల్లో గృహలక్ష్మి లబ్ధిదారులకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రొసీడింగ్స్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.
గుడిసె లేని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.
ఆడబిడ్డలకు కానుక కేసీఆర్ బతుకమ్మ చీరలు అని అన్నారు.
స్థానిక బిడ్డనైన నన్ను ఆశీర్వదించాలని కోరారు.
గతంలో స్థానికేతరులు ఎమ్మెల్యేలుగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు.
ఎన్నికల ముందు వచ్చి తర్వాత వెళ్లిపోయే నాయకులకు ఈ ప్రాంతం మీద మమకారం ఉండదు.
పార్టీలకు అతీతంగా నేను అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందజేస్తున్నాని అన్నారు.
అందరికీ అందుబాటులో ఉంటున్న.ఏ ఆపద వచ్చినా నేను అండగా నిలుస్తానని అన్నారు.
60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని అన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద హనుమాన్ దేవాలయం కొండగట్టులో రూపుదిద్దబోతుంది. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి పునుగొటి ప్రశాంతి కృష్ణారావు, ఎంపీపీ మేనేని స్వర్ణలత రాజ్యం నర్సింగరావు, వైస్ ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్, బి ఆర్ ఎస్ కొడిమ్యాల మండల అధ్యక్షుడు పులి వెంకటేష్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు, అధికారులు, ప్రజలుపాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!