
Telangana BCs Get 42% Reservation
రాష్ట్ర బీసీ ప్రజలకు నా శుభాకాంక్షలు
ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్.
మరిపెడ నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కొత్త మైలురాయి.
బీసీలకు 42% రిజర్వేషన్లతో జీవోనెంబర్9 విడుదల బీసీ వర్గాల ప్రజల ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి, సామాజిక న్యాయం సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లతో జీవోనెంబర్ 9 ని విడుదల చేసింది,వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్నిపెంపొందిస్తూ వారి భవిష్యత్ తరాలకు భరోసా అందించడమే లక్ష్యంగా తీసుకున్నఈ నిర్ణయం గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలలో బీసీలకు 42% సీట్ల రిజర్వేషన్ కల్పిస్తూ వెనుకబడిన వర్గాల ప్రజలకు మరిన్ని అవకాశాలను అందిస్తుంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం తీసుకున్నఈ నిర్ణయం తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి అని, ఇది వెనుకబడిన వర్గాల ప్రజలకు భరోసా అన్నారు,అన్ని వర్గాల ప్రజలను అక్కునచేర్చుకుంటుందని మరోసారి ఋజువు చేసింది అన్నారు,బీసీ సమాజం సమగ్రాభివృద్ధి దిశగా ముందడుగు వేయాలని కోరుకుంటూ..బీసీవర్గాల ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు.