ఎం. ఎల్. ఏ. వనమా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల బాగోగులే లక్ష్యంగా పనిచేస్తున్నానని కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు.అన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని.పాత పాల్వంచలో గల చింతల చెర్వు పై 10కోట్ల రూ:ల వ్యయంతో.మంజూరు అయిన.ట్యాంక్ బండ్ నిర్మాణపు పనులకు శుక్రవారం వనమా.శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే మోడల్ గా తీర్చిదిద్దుతున్నానన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నియోజకవర్గానికి.అధిక నిధులు మంజూరు చేశారని కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలుఆయనకు రుణపడి ఉంటారని.వనమా అన్నారు.
ఈ కార్యక్రమంలో.నీటిపారుదల శాఖ ఈ ఈ .అర్జున్,డి ఇ . రాణి, వనమా రాఘవేంద్రరావు, డీసీఎంస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతామహాలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ స్వామి, తహసీల్దార్ నాగరాజు, జడ్పీటీసీ ఎంపీపీ బరపటి వాసుదేవరావు, ఎంపీపీ మడివి సరస్వతి, సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్, పట్టణ బి ఆర్ ఎస్ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, కొత్వాల సత్యనారాయణ, ముత్యాల వీరభద్ర రావు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కనగాల నారాయణ, రమణమూర్తి నాయుడు, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామ్మూర్తి, పూసల విశ్వనాథం, బండి చిన్న వెంకటేశ్వర్లు, కందుకూరి రాము, బత్తుల మధు, బట్టు మంజుల, గుర్రం నాగయ్య, యాదయ్య, దుర్గాప్రసాద్, బొందిల రాంబాబు, . రాము, కమలాకర్, రాంబాబు, వీరన్న, నవభారత్ ఆనంద్ మరియు తదితరులు పాల్గొన్నారు.