
ఘనంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు
ముత్తారం :- నేటి ధాత్రి
తెలంగాణ స్వాతంత్ర యోధుడు తెలంగాణ స్వాప్నికుడు.. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను మంథని నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల ముత్తారం మండలం కేంద్రంలోని మచ్చపేట గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ముత్తారం మండల శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్కూల్ విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు
ఈ కార్యక్రమంలో ముత్తారం మండలం బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు పొత్తుపెద్ది కిషన్ రెడ్డి ఎంపీపీ జక్కుల ముత్తయ్య వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్ రావు సింగిల్ విండో చైర్మన్ గుజ్జుల రాజు రెడ్డి రైతు సమన్య సమితి అధ్యక్షుడు అత్తె చంద్రమౌళి.సర్పంచుల ఫోరం అద్యక్షుడు నూనె కుమార్. తెలంగాణ జాగృతి పెద్దపెల్లి జిల్లా కో కన్వీనర్ తిత్తుల శ్రీనివాస్. దరియాపూర్ గ్రామ సర్పంచ్ గాదం శ్రీనివాస్-స్రవంతి. గ్రామం శాఖ అధ్యక్షుడు అలువోజు రవీందర్. నేరెళ్ల రమేష్. మాదాసి రమేష్. జంగటి వెంకట్ రెడ్డి.ముత్తారం మండలం అధికార ప్రతినిధి భేద సంపత్. పుల్లారి బాపు మరియు ముత్తారం మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు పాల్గొన్నారు.