Police Conduct Vehicle Checks in Nizampet
ధ్రువపత్రాలు కలిగి ఉండాలి
నిజాంపేట: నేటి ధాత్రి
ద్విచక్ర వాహనదారులు ధ్రువపత్రాలు, హెల్మెట్ కలిగి ఉండాలని పోలీసుల సూచించారు. నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక ఎస్సై రాజేష్ ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లైసెన్స్, ఆర్ సి, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ పరుశురాం గౌడ్, మురళీధర్, కానిస్టేబుల్ అశోక్ ఉన్నారు.
