కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వాక్ బిల్లును వ్యతిరేకిస్తున్న ముస్లింలు
జహీరాబాద్ .నేటి ధాత్రి:
కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించిన బిల్లు రద్దు చేయాలని కోరుతూ ముస్లిం కమ్యూనిటీ వారు శుక్రవారం నమాజ్ తరువాత నల్లబ్యాడ్జీలు కట్టు కొని నిరసన తెలిపారు. వక్ఫ్ (సవరణ) బిల్లు,ను వ్యతిరేకించడానికి శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలాలలో వివిధ ముస్లిం సంస్థలు ఏకమయ్యాయి.

పార్లమెంటులో ప్రవేశపెట్టబడిన ఈ బిల్లు, వక్ఫ్ బోర్డు పనులను క్రమబద్ధీకరించడం మరియు వక్ఫ్ ఆస్తుల నిర్వహణను మెరుగుపరచడం లక్ష్యంగా 1995 వక్ఫ్ చట్టాన్ని సవరించడానికి ప్రయత్నిస్తుందాని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, ప్రతిపాదిత సవరణ తమ విశ్వాసంపై ప్రత్యక్ష దాడి అని వారు పేర్కొన్నారు మరియు దానిని ఆమోదించవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. “రాబోయే రోజుల్లో మేము మరింత శక్తితో ముందుకు వచ్చి ప్రభుత్వానికి ఈ బిల్లును అనుమతించబోమని సందేశం వ్యక్తం చేశారు
ఇది ముస్లింల ఆస్తి ఎందుకంటే ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ను ముస్లింల పెద్దలు తన వాటాలో ఉన్న భూమి దానమిచ్చిన ఆస్తి ఇది అన్నారు ఇది ప్రభుత్వ ఆస్తులు కాదన్నారు. బిల్లును ఆమోదిస్తే ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆధ్వర్యంలో దేశమంతా ధర్నాలు నిరాసనాలు జరుగుతాయన్నారు.