
Mushrooms
గంగవరం మండలంలో పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న అక్రమ లేఔట్ లు
నోటీసులకే పరిమితమైన అధికారులు
గంగవరం(నేటి ధాత్రి) జూలై 16:
పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో అక్రమాలకు అడ్డాగా మారిపోయింది, అక్రమ కట్టడాలు ఒకవైపు ఉంటే మరోవైపు అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి, అధికారులు నోటీసులు ఇవ్వడం వరకే పరిమితమై పూర్తిస్థాయిలో అరికట్టడంలో విఫలమయ్యారు,ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి అక్రమాలు చేస్తుంటే నోటీసులు ఇస్తుంటే ఉంటే లాభం ఏమిటి అని ఇప్పటికే ఎన్నో వార్తా కథనాలు రూపంలో అధికారుల నిర్లక్ష్యం చూపుతున్న కూడా అధికారులు పట్టించుకోవడం లేదు, ఇందుకు కారణం రాజకీయ ఒత్తుల్లా ? లేక ఏదైనా ప్రలోభాలకు లోబడి ఈ విధంగా చేస్తున్నారా అని సందేహాలు కూడా వస్తున్నాయి, ఇదే క్రమంలో భాగంగా గంగవరం మండలంలో దాదాపు 20 నుంచి 25 లేఔట్ లు అనుమతులు లేకుండా ప్రభుత్వ నియమాలు పట్టించుకోకుండా వేశారు,
అయిన కూడా అధికారులు ఏ విధమైనటువంటి స్పందన లేదు అంటే ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది, ఇదే క్రమంలో భాగంగా ఈ విషయంపై గంగవరం పంచాయతీ కార్యదర్శి సుధాకర్ వివరణ కోరగా అక్రమ కట్టడాలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని అయినా కూడా నిర్లక్ష్యప్రయంగా నిర్మిస్తున్నారని వారిపై చర్యలు కచ్చితంగా తీసుకుంటామని
ఈ సందర్భంగా ఆయన
తెలిపారు,అదే విధంగా లేఔట్ విషయంలో కూడా నోటీసులు ఇచ్చామని వారిపై కూడా ప్రభుత్వ నియమాల పరంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు,ఏది ఏమైనా అగ్రికల్చర్ భూములను మార్చి ఎటువంటి అనుమతులు లేకుండా కమర్షియల్ గా మార్చుకుంటున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోకుంటే రాబోవు రోజుల్లో పూర్తిస్థాయిలో అగ్రికల్చర్ భూములన్ని లేఔట్ గా మారి పూర్తిస్థాయిలో వ్యవసాయం దూరమయ్యే అవకాశాలు లేకపోలేదు, మరి ఇన్ని జరుగుతున్నా కూడా గంగవరం మండలం పై అధికారులు పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకోలేదంటే అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి, అలాగే కొన్ని విద్యాసంస్థలు కూడా నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు నిర్మించినట్లు కూడా వెలుగులోకి వచ్చింది,
మరి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంది…