` నలభై ఏళ్లు పాలించి గుక్కెడు మంచి నీళ్లివ్వలేదు కాంగ్రెస్
` ఫ్లోరైడ్ బాధితులను కళ్ల ముందుంచిన కనికరించలేదు కమలనాధులు.
`జనం చేవలేని జీవచ్చవాలైనా కన్నెత్తి చూడలేదు.
`అయ్యో పాపమని పది పైసలు విడుదల చేయలేదు.
` నాగార్జున సాగర్ నీళ్లు సముద్రపు పాలు చేశారే గాని నల్గొండకియ్యలేదు.
` కాంగ్రెస్ వున్నంత కాలం ఫ్లోరైడ్ బాధ తీరలేదు.
`మునుగోడు నీళ్ల గోడు ఆనాడు ఏ పార్టీ వినలేదు.
`పులిచింతల ప్రాజెక్టు కోసం అన్న రాజకీయం..
`రూ.18వేల ప్రాజెక్టు కోసం తమ్ముడు పార్టీ మారడం.
`తెలంగాణ వచ్చింది… ఫ్లోరైడ్ పీడ విరగడైంది.
`మిషన్ భగీరథ మునుగోడు బాధ తీర్చింది.
` ఫ్లోరైడ్ భూతాన్ని తరిమింది!
`ఉమ్మడి నల్గొండలో నేడు మంచినీటి పరవళ్లు.
` చెరువులు కళ కళ…ఎత్తిపోతలతో జలజల…
`తీరింది నీటి కటకట…
` ఇదంతా జనం చెబుతున్న మాట…
తెలంగాణ గోస ఒకనాడు రాసుకుంటే రామాయణమంత! చెప్పుకుంటే భారతమంతా!! అరవైఏళ్ల గోస…నీళ్లు లేవు…నిధులు లేవు…కొలువుల్లో తెలంగాణ వారికి చోటు లేదు. నల్లగొండ జిల్లా అంటే ఇప్పటికీ నిద్రలో కూడా ఉలిక్కిపడేలా చేసేది ఫ్లోరైడ్ భూతం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పుట్టిన వాళ్లైనా, ఓ ఏడాది పాటు నీళ్లు తాగినా పళ్లమీద గారలు.. పుచ్చిన పళ్లు.కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, చేతి వంకరలు, అక్కడే పుట్టిన వాళ్లకు నడుములు ఒంకరలు, ఎదగని ఎముకలు, శారీరక, మానసిక వైకల్యాలు. ఇవీ నల్లగొండ ప్రజలు అనుభవించిన కష్టాలు. ఒక రకంగా అవి నరకాలు. కొన్నేళ్లుగా కొన్ని లక్షల మంది ఇబ్బందులు పడ్డారు. తనువులు చాలించారు. అయినా ఆనాటి పాలకులకు కనికరం రాలేదు. ఆ జిల్లాకు నీళ్లు తెచ్చేందుకు ఇష్టపడలేదు. ఆ ప్రాంత నాయకులకు శక్తి లేదు. ఉమ్మడి పాలకులను నిలదీసే ధైర్యం చేయలేదు. పదవులు ముఖ్యమనుకున్నారు. నీళ్ల పేరు చెప్పి ఎన్నికల్లో అనేక సార్లు గెలిచారు. ఎమ్మెల్యేలయ్యారు. మంత్రులయ్యారు. ప్రతిసారి ప్రజలు మభ్యపెట్టారు. మోసం చేశారు. కాని నీళ్ల చుక్క తేలేదు. మరో వైపు నల్లగొండ ఉమ్మడి జిల్లాకు మంచినీళ్లు ఇవ్వడానికి ఉమ్మడి పాలకులకు మనసు రాలేదు. కాని నేడు నల్లగొండలో మారింది. దాని రూపు రేఖలు మారాయి. ఊరూరికి సురక్షితమైన మంచినీరు అందుతోంది. అందులో మునుగోడు కూడా వుంది. మునుగోడులో కూడా మంచినీరు ఇంటింటికి వస్తోంది. ప్రజలు ఫ్లోరైడ్ బారి నుంచి రక్షించబడ్డారు. ఆరోగ్యవంతమైన రేపటి తరం చూడనున్నారు. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత నల్లగొండ జిల్లాలో ఎగువ ప్రాంతంలో నిర్మాణం సాగాల్సిన నాగార్జున సాగర్ ప్రాజెక్టును సీమాంధ్రకు మేలు చేసేలా దిగువ ప్రాంతానికి తరలించారు. తెలంగాణకు అన్యాయం చేయడం ఆనాడే మొదలుపెట్టారు. నీళ్ల గోస తీరకుండా చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఫ్లోరైడ్ భూతాన్ని పెంచి పోషించారు. నిజానికి మొదట ప్రతిపాదించిన చోట నాగార్జున సారగ్ నిర్మాణం జరిగితే, ఆనాడే ఫ్లోరైడ్ బాధ తీరిపోయేది. నల్లగొండ సస్యశ్యామలయ్యేది. నల్లగొండలో సిరులు పండేవి. కాని నాగార్జున సాగర్ నిర్మాణం ఆంధ్రకు అనుకూలమైన ప్రదేశాన్ని ఎన్నుకొని, నిర్మాణం పూర్తిచేసి ఆంధ్రకు మేలు జరిగేలా చేసుకున్నారు. తెలంగాణకు తీరని అన్యాయంచేశారు. అంతే కాదు ప్రతి ఏటా లక్షలాది క్యూసెక్కుల నీటిని సముద్రం పాలు చేయడానికైనా సిద్ధపడ్డారేగాని, తెలంగాణకు ఇవ్వడానికి ఆనాటి పాలకులకు మనసు రాలేదు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ అన్న పేరే గాని ఎన్నడూ సక్కగ నీళ్లించ్చింది లేదు. కాలువ పనులు కూడా బాగు చేసింది లేదు. ఆఖరుకు కాలువ పూడిపోతున్నా చూశారే గాని, నల్లగొండ జిల్లా రైతులకు నీరివ్వలేదు. అయినా ఆనాడు ఏ నాయకుడు నోరు మొదలేదు.
కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని, తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎన్నుకుంటే వాళ్లు చేసింది అదే…తెలంగాణకు అన్యాయం చేసింది కూడా వాళ్లే…! అయితే ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబాన్ని ప్రజలు ఆదరించారు. వారికి పదవులు కట్టబెట్టారు. ప్రతి సారి గెలిపిస్తూవచ్చారు. దాంతో జిల్లాను శాసించే రాజకీయాలు చేసేంత శక్తివంతులుగా కోమటిరెడ్డి సోదరులు ఎదిగారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు. జిల్లా రాజకీయాలను మొత్తం తన గుప్పిట్టో పెట్టుకున్నారు. కాని నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ లేకుండా చేయలేకపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరు ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక్క చిత్తూరు జిల్లా మంచినీటి అవసరాలు తీర్చేందుకు రూ.8వేల కోట్ల రూపాయాలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అది కూడా నిండు అసెంబ్లీలో ఆ ప్రకటన చేశారు. తెలంగాణ వస్తుందని తెలుసు. ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం సాగుతున్నదని తెలుసు. అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించలేదు. చిత్తూరు జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యలేదు. ప్రజలకు ఇబ్బంది లేదు. కాని మా నల్లగొండకు నీళ్లెందుకు ఇవ్వరు? నిధులెందుకు కేటాయించరు? అని ప్రశ్నించలేదు. ఈ ప్రకటన చేసిన సమయంలోనే ఆనాడు హరీష్‌రావు అప్పటి ప్రభుత్వాన్ని ఎండగట్టాడు. అసెంబ్లీలో నిలదీశాడు. తెలంగాణలో నీటికరువు వుందని, ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు అనేక వున్నాయని అసెంబ్లీ దృష్టికి తెచ్చారు. నల్లగొండ జిల్లాలో ఇలాగే కొనసాగితే, ఏదొ ఒకనాడు ఆ జిల్లాలో జనం బతకాలంటే భయపడతారని అన్నారు. మీ చిత్తూరు జిల్లాకు రూ. 8వేల కోట్లు కేటాయించుకున్నారు. కనీసం మా తెలంగాణకు కనీసం రూ.2వేల కోట్లైనా ఇవ్వండని హరీష్‌రావు అడిగితే, ఒక్క రూపాయి కూడా ఇవ్వను…ఏం చేసుకుంటారో చేసుకోండి? అని కిరణ్‌కుమార్ రెడ్డి అన్నప్పుడైనా కోమటిరెడ్డి అభ్యంతరం చెప్పలేదు. అదితప్పని నిలదీయలేదు. ఏనాడు కోమటిరెడ్డి నీళ్లకోసం కొట్లాడలేదు. కాని పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్టు తీసుకున్నారు. ఒకనాడు పులిచింతల నిర్మాణం జిరిగితే తెలంగాణకు తీరని అన్యాయం జరుతుందని మొసలి కన్నీరు కార్చి, అది ప్రారంభిస్తే అందులో దూకి ఆత్మహత్య చేసుకుంటానన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదే ప్రాజెక్టుకు కాంట్రాక్టరయ్యడు. ఆయన చేతుల మీదుగానే పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం చేశాడు. ఆంధ్రకు నీళ్లందించే పని తన చేతుల మీదుగా పూర్తిచేశాడు. నల్లగొండను గాలికి వదిలేశాడు. సీమాంధ్రులకు మేలు చేసే పని చేపట్టాడు. కాంట్రాక్టు పేరుతో నల్లగొండ జిల్లా ప్రజల ప్రయోజనాలు తాకట్టుపెట్టారు. ఆర్ధికంగా ఎదిగారు. కోట్లు కూడాబెట్టుకున్నాడు. కాని ప్రజలు గురించి ఆలోచించలేదు. ఆనాడు అన్న చేసిన పనే, ఈనాడు తమ్ముడు చేస్తున్నాడు. అన్న పులిచింతల మీద రాజకీయం చేసి కాంట్రాక్టును దక్కించుకుంటే, తమ్ముడు మునుగోడును ముంచి రూ.18000 కోట్లు ప్రాజెక్టు దక్కించుకున్నాడని రాజకీయ పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఓ వైపు తెలంగాణ ఉద్యమకాలంలో ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవాలని, నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ మూలంగా పండే పంటల్లో, తినే ఆహారంలో కూడా ఫ్లోరైడ్ వుంటోందని ఆనాడు కేసిఆర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ముందుకు ఫ్లోరైడ్ బాధితులను తీసుకెళ్లారు. అయినా వారికి జాలి కలగలేదు. నల్లగొండ జిల్లాకు మంచినీళ్లు ఇచ్చే మనసు రాలేదు.
ఇక బిజేపి వాళ్లు తక్కువేం కాదు…కాంగ్రెస్ ను కాదని 1999లో ప్రజలు కేంద్రంలో బిజేపిని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ సమయంలో నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ను నుంచి ప్రజలను రక్షించాలని కోరుతూ నాటి ప్రధాని వాజ్‌పాయ్‌కు ఎన్ని సార్లు విజ్ఞాపనలు చేసినా పట్టించుకోలేదు. ఆయన ముందుకు ఫ్లోరైడ్ బాధితులను తీసుకెళ్లిచూపించినా కనికరం చూపలేదు. రూపాయి మంచినీటి కోసం విడుదల చేయలేదు. కాని నేడు మునుగోడులో బిజేపి గెలిపించాలని ఆ పార్టీ నాయకులు రావడాన్ని ప్రజలు విచిత్రంగా చూస్తున్నారు. వారి ప్రకటనలకు నవ్వుకుంటున్నారు. తెలంగాణ రాకపోతే ఉమ్మడి నల్లగొండ ఈ పాటికి ఎడారిగా మారేదన్న మాటలే వినిపిస్తున్నాయి. మరింత ఫ్లోరైడ్ పెరిగి, ప్రజలు బతికేందుకు కూడా వీలులేకుండాపోయేది. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్ నల్లగొండ జిల్లా మీద ప్రత్యేకమైన దృష్టిపెట్టి, చెరువుల పునరుద్దరణ పనులు ఎక్కువగా చేపట్టారు. మిషన్ భగీరధ పనులు వేగంగా ఆ జిల్లాలో పూర్తి చేశారు. ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందుబాటులోకి తెచ్చారు. ఎక్కడిక్కడ రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తిచేశారు. ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేశారు. ఫ్లోరైడ్ భూతాన్ని నల్లగొండ నుంచి తరిమేశారు. అదే ఉమ్మడి రాష్ట్రం కొనసాగితే మరో వందేళ్లయినా ఫ్లోరైడ్ సమస్య తీరకపోయేది. నాయకులు ఆ సమస్యను పట్టించుకోకపోయేవారు. నీళ్ల కోసం సాగిన తెలంగాణ ఉద్యమం మూలంగా, రాష్ట్రం సాధించుకోవడం వల్లనే నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ మహామ్మారిని పారద్రోలడం జరిగింది. ఫ్లోరైడ్ నిర్మూలించడ జరిగింది. భూగర్భ జలాలను పెంచుకొని, సురక్షితమైన మంచినీటితోపాటు, ఫ్లోరైడ్ లేని పంటు కూడా పండిరచుకుంటున్నారు. ప్రజలు ఆరోగ్యవంతులయ్యారు. ఇది టిఆర్‌ఎస్ ప్రభుత్వ విజయం. మా ఆరోగ్యాలకు ప్రభుత్వం ఇచ్చిన ధైర్యం అని ప్రజలే అంటున్నారు. ఏనాడు నల్లగొండ నీటి గోస గురించి పట్టించుకోని పార్టీలన్నీ ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నాయని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. వారికి తగిన గుణపాఠం చెబుతామంటున్నారు.