Water Crisis Protest in Narsampet Ward 1
మంచినీటి కోసం మున్సిపాలిటీ ముట్టడి
నల్లా నీళ్లు రావడం లేదంటూ బిందెలతో కాలనీవాసుల ధర్నా
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని 1వ వార్డు కాలనీలో తీవ్ర మంచినీటి సంక్షోభం నెలకొంది.గత కొంతకాలంగా కాలనీలో నల్లా నీళ్లు కూడా సరిగా రావడం లేదని,తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈసందర్భంగా 1 వ వార్డు మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల ఆధ్వర్యంలో శనివారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టి నిరసన తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ ఒకటో వార్డులో గత కొన్ని నెలలుగా నీటి సమస్యలు వస్తున్నాయని పలుమార్లు మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని తెలిపారు.ప్రశ్నిస్తూ ఫిర్యాదు చేసిన వారిపై దురుసుగా వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు.అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా కాలనీవాసులు మున్సిపాలిటీ కార్యాలయం ముందు బిందెలతో ధర్నా చేపట్టిన మహిళలు ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి తక్షణమే మంచినీటి సరఫరా పునరుద్ధరించాలి, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మౌలిక వసతులైన తాగునీటి సమస్యను పట్టించుకోకపోవడం ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతుందని, బాధ్యతాయుతంగా అధికారులు వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో
కూరపాటి క్రిస్టఫర్, సంకినేని హనుమంతరావు, దంచనాదుల సురేష్, దంచనాదుల సతీష్,ఎండి అఫ్జల్ పాషా, భూక్య మంజుల, మొగిలిచర్ల లక్ష్మి, భూక్య సునీత, నల్లబెల్లి మంజుల,
ఎండీ గుడియా బేగం,ఎండీ కౌసర్, ఎం.ఈ హసీనా, ఎం.ఈ జరినా, ఎం.ఈ సజియా, ఎండీ నూర్,
శ్రీపెల్లి రమ, మల్యాల నాగలక్ష్మి, జాటోత్ విజయ, లవూడియా విజయ తదితరులు పాల్గొన్నారు.
