
మున్సిపాలిటీ వార్డులను శాస్త్రీయంగా విభజించాలి.
కల్వకుర్తి / నేటి ధాత్రి:
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కల్వకుర్తి మున్సిపాలిటీలోని వార్డులను క్రమ పద్ధతిలో శాస్త్రీయంగా విభజన చేయాలని బిజెపి నాయకులు కోరారు.ఆర్ డి ఓ ఆఫీస్ లో జరిగిన ఓటర్ లిస్ట్ అవగాహన సదస్సులో బిజెపి నాయకులు పాల్గొన్నారు. కల్వకుర్తి ఆర్డీవో గా నూతనంగా నియమింపబడిన ఎంపీ జనార్దన్ రెడ్డిని శాలువాతో సత్కరించారు తదనంతరం కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్ లిస్టులో గల పలు సమస్యలను లిఖితపూర్వకంగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..మున్సిపాలిటీ పరిధిలో వార్డులను విభజించేటప్పుడు అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా విభజన చేయడం గతంలో జరిగింది, వార్డుల విభజన జరిగేటప్పుడు అన్ని పార్టీల సమ్మతి తీసుకోవాలి, బిఎల్వోలు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని వారిపై తగు చర్యలు చేపట్టాలని, తిలక్ నగర్ కాలనీ ప్రజలకు స్థానికంగానే పోలింగ్ బూతు ఏర్పాటు చేయాలని, ఒక ఇంట్లోని ఓట్లు అన్నీ కూడా ఒకే వార్డులో ఉండేలా చూడాలని,18 ఏళ్ళు నిండిన ప్రతి యువతీ యువకులకు వెంటనే ఓటర్ నమోదు కార్యక్రమం చేపట్టాలని,ఇంటి నెంబర్ల ప్రకారం కాకుండా బౌండరీల ప్రకారం వార్డులు ఏర్పాటు చేయాలని, పలు సూచనలు చేశారు పై సూచనలు దృష్టిలో పెట్టుకొని ఓటర్ లిస్టులు తయారు చేయాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని తెలియజేశారు…కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబిదేవ్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్,జిల్లా ఉపాధ్యక్షులు బోడ నరసింహ, సీనియర్ నాయకులు, సూర్య కృష్ణ గౌడ్, నీరుకంటి రాఘవేందర్ గౌడ్, నరేడ్ల శేఖర్ రెడ్డి, సురేందర్ గౌడ్, పెద్దారి విజయ్, చందు ముదిరాజ్, పట్టణ ప్రధాన కార్యదర్శి నాప శివ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.