ఉచిత మెడికల్ క్యాంపును వినియోగించుకున్న పురపాలక ప్రజలు

ఉచిత మెగా వైద్య శిబిరానికి భారీ స్పందన

తవక్కల్ పాఠశాల అధినేత అబ్ధుల్ అజీజ్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణంలోని తవక్కల్ పాఠశాలలో మ్యాక్స్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రాఘవేంద్ర పిల్లల హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో భారీగా ప్రజలు హాజరై వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు.ఉచిత మెగా వైద్య శిబిరానికి క్యాతన్ పల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ జంగం కళ, పట్టణ ఎస్ఐ రాజశేఖర్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు. నేటి రోజుల్లో ఆరోగ్యం పట్ల ప్రజలు శ్రద్ద చూపే అవసరం ఎంతైనా వుందని అన్నారు. మ్యాక్స్ కేర్, రాఘవేంద్ర ఆసుపత్రి వారు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వైద్య శిబిరం నిర్వహించిన తవక్కల్ పాఠశాల అధినేత అబ్దుల్ అజీజ్ ను అభినందించారు. ఈ రోజులలో వైద్యం పేదవాడికి అందని ద్రాక్షగా మిగిలిన నేపథ్యంలో రామకృష్ణాపూర్ పట్టణంలో కార్పొరేట్ ఆస్పత్రి వారు ఉచితంగా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించిన సందర్భంగా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్య సేవలు అందిస్తూ సుమారు లక్ష రూపాయల విలువైన మందులను అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, డాక్టర్లు తేజస్విని, నాగరాజు, సతీష్ కుమార్, లక్ష్మి ,శ్రీకర్,సుమారు 700 మంది ట్రీట్మెంట్లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!