రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టనంలోని మిషన్ భగీరథ కు సంబంధించిన పంపు వాల్ ప్రహరీ పైకప్పు వేయకపోవడంతో మూగ జీవాలు,పశువులు పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. క్యాతనపల్లి మున్సిపాలిటీ లో చాలా చోట్ల మిషన్ భగీరథ పంపు వాల్ ప్రహరీ నిర్మించి పై కప్పు వదిలేశారు కాంట్రాక్టర్లు. అధికారుల పర్యవేక్షణ లేక కాంట్రాక్టర్లు ఇష్టా రీతిలో బిల్లులు పొంది పనులను గాలికి వదిలేశారు. మున్సిపాలిటీ అధికారుల, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇంకా ఎన్ని మూగజీవాలు మిషన్ భగీరథ వాల్ పంపు సెట్ లో పడి ప్రమాదాలకు గురై ప్రాణాలు పోతాయోనని పశువుల యాజమానులు వాపోతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చొరవ తీసుకోవాలని పాడి రైతుల సంఘం రాష్ట్ర కో కన్వీనర్ పాల రాజయ్య కోరుతున్నారు.