MIM Candidate Mohammad Rafi Campaigns in Ward 14
*మున్సిపల్ ఎన్నికల ప్రచారం: ఎంఐఎం అభ్యర్థి మొహమ్మద్ రఫీ*
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, 14వ వార్డు అభ్యర్థి మొహమ్మద్ రఫీ కాలనీలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మొహమ్మద్ రఫీ, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు, మురుగు కాలువల నిర్వహణకు శాశ్వత పరిష్కారం,
చర్యలు, మెరుగైన రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ ఎన్నికలలో ఎంఐఎం పార్టీకి భారీ మెజారిటీతో విజయం అందించాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా వారు ఇంటింటా తిరుగుతూ ప్రజలతో ఓటును అభ్యర్థించారు.ఈ సందర్భంగా అభ్యర్థి మొహమ్మద్ రఫీ,మాట్లాడుతూ వార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని అన్నారు.సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చేస్తామని ఎంఐఎం పార్టీ నుంచి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువ నాయకులు పాల్గొన్నారు.
