
Municipal corporation officials
ప్రజావాణిలో ఫిర్యాదుకు స్పందించిన నగరపాలక సంస్థ అధికారులు
పాత మంచిర్యాల పార్కులో పారిశుధ్య చర్యలు ప్రారంభం
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని పాత మంచిర్యాల శ్రీలక్ష్మీ నగర్ లో ఉన్న పట్టణ ప్రకృతి వనం ( పార్క్ ) లో నగరపాలక సంస్థ సిబ్బంది శుక్రవారం పరిశుభ్రత, పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు.అందరికీ ఆహ్లాదం పంచాలనే ఉద్దేశంతో రూ. 90 లక్షల వ్యయంతో శ్రీలక్ష్మినగర్ లో నిర్మించిన పార్క్ నిర్వహణ సరిగా లేదని, వాకింగ్ ట్రాక్ లో గడ్డి మొలచి, చెత్త పొగయిందని,తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం లో గత సోమవారం జరిగిన ప్రజావాణి లో పాత మంచిర్యాల కు చెందిన గోగు సురేష్ కుమార్ ఫిర్యాదు చేశారు.ఈ విషయంపై పత్రికలో వార్తలు రావడంతో స్పందించిన నగర పాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు.పారిశుధ్య సిబ్బంది వాకింగ్ ట్రాక్ లో పెరిగిన గడ్డి తొలగించి శుభ్రం చేశారు.3 రోజుల్లో పారిశుధ్య చర్యలు పూర్తిచేస్తామని, మంచిర్యాల నగర పాలక సంస్థ పర్యావరణ అధికారి ప్రవీణ్ తెలిపారు.ఫిర్యాదు చేసినప్పుడే కాకుండా వారం రోజుల కొకసారి ఈ పార్క్ లో పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఈ పార్క్ లో వాకింగ్, వ్యాయామం చేసే వారు కోరుతున్నారు.3 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ పార్క్ లో చెట్ల మధ్య ఖాళీ మైదానం లో పెరిగిన పిచ్చి గడ్డి మొక్కలు తొలగించి ఇసుక నింపి పిల్లలు ఆదుకోవడానికి వీలుగా ఆట పరికరాలతో ప్లేయింగ్ జోన్ తయారు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కోరారు.ఈ విషయం పై ప్రజా ప్రతినిధులు,అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.