
నేటిధాత్రి, వరంగల్ తూర్పు
వరంగల్ తూర్పు నియోజకవర్గం 28వ డివిజన్లోని బొందివాగు నాలా సమస్యను మంత్రి కొండా దంపతుల దృష్టికి తీసుకువెళ్లగా, వారు వెంటనే స్పందించి వరంగల్ మున్సిపల్ కమిషనర్ కి చెప్పగా, మున్సిపల్ కమిషనర్ స్పందించి, కమిషనర్ స్వయంగా వెళ్లి బొంది వాగు నాలాను పరిశీలించి రెండు మూడు రోజులలో అందులో ఉన్నటువంటి గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించి, వర్షాకాల ప్రభావ సమస్య నుంచి కొంత ఉపశమనం లభించే విధంగా ముందస్తు చర్యగా చర్యలు చేపట్టడం జరిగింది. సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో 28వ డివిజన్ అధ్యక్షుడు కురిమిళ్ళ సంపత్ పాల్గొని మున్సిపల్ కమిషనర్ కి అక్కడి సమస్య గూర్చి వివరిస్తూ తెలిపారు.