వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ముస్లిం ల ప్రధాన పండగ రంజాన్ ను పురస్కరించుకుని జరువుకునే రంజాన్ పండుగ నేపథ్యంలో వేములవాడ పట్టణంలోని ఈద్గా మైదానాన్ని గురువారం వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ పరిశీలించారు. ఈద్గా ఆవరణలో గల ఖబ్రాస్తాన్ లో మున్సిపల్ సిబ్బంది తో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టరు. ఈ పనులను అయన పరిశీలించి, మైదానంలో, ఖబ్రాస్తాన్ లో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు ఈద్గా మైదానంకు వచ్చే ముస్లిం లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ పరంగా అన్ని ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నామని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, మసీద్ అధ్యక్షులు షేక్ ఇమామ్, ముస్లిం మత పెద్దలు షేక్ రియాజ్,సయ్యద్ ఆన్సర్,షేక్ ఇంతియాజ్, నాయకులు,షేక్ వాజిద్ ,ఇర్ఫాన్,మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.