Eidgah Preparations Reviewed in Zahirabad
జహీరాబాద్ ఈద్గాలో మున్సిపల్ చైర్మన్ పర్యవేక్షణ
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పవిత్ర రంజాన్ పండుగ (ఈదుల్ ఫితర్) సమీపిస్తున్న తరుణంలో, జహీరాబాద్లోని ప్రధాన ఈద్గా వద్ద మున్సిపల్ యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. సోమవారం జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ మహ్మద్ యూనుస్, స్థానిక కౌన్సిలర్లు మరియు సీనియర్ నాయకులతో కలిసి ఈద్గాను సందర్శించారు. పండుగ రోజున వేలాది మంది ముస్లిం సోదరులు ప్రార్థనల కోసం తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈద్గా ఆవరణలో ఉన్న సౌకర్యాలను చైర్మన్ స్వయంగా పరిశీలించి, పెండింగ్లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు.

