వనపర్తి నేటిదాత్రి;
వనపర్తి జిల్లా కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా సెల్లార్లు భవనాలు నిర్మాణం చేసిన వాటిని మున్సిపల్ అధికారులు తనిఖీలు చేయాలని ప్రజలు కోరుతున్నారు . సెల్లార్ బవన నిర్మాణం చేపట్టాలంటే అటుపక్క ఇటుపక్క భవనం ఉన్న వారితో సంప్రదించి మున్సిపల్ అనుమతి పర్మిషన్ పొందాల్సి ఉంటుంది. అలాంటివి ఏమి చేయకుండా అధికారుల ను రాజకీయ నాయకులను అండగా ఏర్పాటు చేసుకొని సెల్లార్లు నిర్మించి ప్రక్కన భవనం ప్రమాదం కూలి పోవడానికి అవకాశం ఉంటుంది అని వారి ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . వెంటనే వనపర్తి జిల్లా కలెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ హైదరాబాద్ వనపర్తి లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే ఎన్ని అక్రమ సెల్లార్లు భవనాలు మున్సిపల్ అనుమతి లేని భవనాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిజాయితీపరులు అంటున్నారు. కర్నూల్ రోడ్డు కొత్తకోట రోడ్డు పాలిటెక్నిక్ రోడ్ హైదరాబాద్ రోడ్ చిట్యాల రోడ్ లో తనిఖీలు నిర్వహిస్తే అధికారులకు ప్రజా ప్రతినిధులకు అక్రమంగా నిర్మించే భవనాలు తెలుస్తాయని నిజాయితీ పరులు అంటున్నారు