వనపర్తి నేటిధాత్రి :
డబుల్ బెడ్ రూముల లలో నివాసం ఉన్న వారికి సౌకర్యాలు కల్పించడం లో మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని అఖిల పక్ష ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ తెలిపారు డబుల్ బెడ్ రూములు అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు పరిశీలించారు . ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్.లలో నివాసం ఉన్న వారి సమస్య గురించి మున్సిపాల్ కమిషనర్ కు గతo లో వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు . రోడ్లు, మంచినీటి సౌకర్యం, వీధిలైట్లు, శానిటేషన్ లేకుండా డబుల్ బెడ్ రూములు ఇచ్చారని మున్సిపాలిటీ నుండి ఫ్రైడే ఫ్రైడే అంటూ కార్యక్రమాలు చేస్తున్నారని డబల్ బెడ్ రూమ్ పక్క న.మురికి నీరు మడుగులు ఉన్నాయని వాటిని కూడా డ్రై చేయాలని, డిమాండ్ చేశారు . కొత్తగా వచ్చిన కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కౌన్సిల్ రూమ్ ల పై దృష్టి పెట్టాలని, వెంటనే వారి సమస్యలు పరిష్కరించకుంటే ధర్నాలు బందులు ప్రకటిస్తామని అఖిలపక్ష ఐక్యవేదిక సతీష్ యాదవ్ తెలిపారు.
ఎస్సీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు, టిడిపి రాష్ట్ర నాయకులు కొత్త గొల్ల శంకర్, దళిత సంఘం రాష్ట్ర దళిత రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు గంధం సుమన్, సిపిఎం రాష్ట్ర నాయకులు రాజు, బొడ్డుపల్లి సతీష్, సిపిఐ నాయకులు, డబల్ బెడ్ రూమ్ లో నివాసముండే ప్రజలు పాల్గొన్నారు.