
Oorati Munender
బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్‌గా మునెందర్ నియామకం
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ మీడియా కన్వీనర్‌గా ఊరటి మునెందర్ నియమితులయ్యారు.బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు ఆదేశాల మేరకు,జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా ఊరటి మునెందర్ మాట్లాడుతూ “బీజేపీ భావజాలాన్ని,కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు స్వచ్ఛందంగా చేరవేయడం, పార్టీ కార్యకలాపాలను విస్తృతంగా ప్రచారం చేయడం నా ప్రధాన బాధ్యత అని జిల్లా లోని ప్రతి గ్రామం,ప్రతి మండలానికి పార్టీ స్వరం చేరేలా కృషి చేస్తాను”అని అన్నారు.జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ… మునెందర్ పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు అని మీడియా విభాగంలో ఆయన అనుభవం పార్టీకి మరింత బలాన్నిస్తుంది అని అభిప్రాయపడ్డారు.ఈ నా పార్టీ పదవికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు కి, జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి కి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి సత్యపాల్ రెడ్డి కి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్న కి కన్నం యుగదీశ్వర్ కు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు.