పాలకుర్తి నేటిధాత్రి
జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుకుంటున్న జనగాం గౌతమ్ తాత గత నెల డిసెంబర్ 23 న ప్రమాదవ శాత్తు స్వర్గస్థులయినారు. వారి తాత జ్ఞాపకార్ధం కీ.శే. జనగాం సోమయ్య కుమారుడు జనగాం గణేష్ విస్నూర్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు వారు మధ్యాహ్న భోజనం చేసే భోజన ప్లేట్స్ వారి తండ్రి జ్ఞాపకార్ధం 5000 రూపాయల విలువ చేసే 50 ప్లేట్స్ బహుకరించారు. వారి తండ్రి మీద ఉన్న ప్రేమతో తన ఊరి పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల కోసం ప్లేట్స్ బహుకరించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెనుగొండ సోమన్న, ఉపాద్యాయులు మాధురి, కవిత, హేమాలత గణేష్ ను అభినందించారు. గ్రామ పెద్దలు అయిన గ్రామ సర్పంచ్ నకీర్త యాకయ్య, ఎంపీటీసీ మాటూరి యాకయ్య, ఉప సర్పంచ్ నళిని సోమేశ్వర రావ్, 6 వార్డు మెంబెర్ సోమన్న, మాజీ విద్యా కమిటీ ఛైర్మన్ పొలాస సోమయ్య, వైస్ చైర్మన్ బాలగాని నాగరాజు, మాజీ కొడకండ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవ రావ్, ప్రవాస భారతీయుల విస్నూర్ గ్రామ వాస్తవ్యులు దొంతినేని వెంకటేశ్వరరావు జనగామ గణేష్ ను అభినందించటంతో గణేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.